Moviesనాని హిట్ 3 బుల్లితెర‌పై ఎంజాయ్ చేస్తారా: OTT రిలీజ్ డేట్...

నాని హిట్ 3 బుల్లితెర‌పై ఎంజాయ్ చేస్తారా: OTT రిలీజ్ డేట్ వ‌చ్చేసింది… !

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ యాక్ష‌న్ డ్రామా “హిట్ 3” . భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. నాని కెరీర్‌లో మ‌రో సూప‌ర్ హిట్ సినిమాగా నిలిచిపోయింది. నాని కెరీర్‌లోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ అందుకుని.. లాంగ్ ర‌న్‌లోనూ మంచి ర‌న్ అందుకుంది హిట్ 3. ఇలా థియేట‌ర్ల‌లో అద‌ర‌గొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక‌ హిట్ 3 ఈ మే 29 నుంచి వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు డేట్ ఇచ్చేశారు. ఇక హిట్ 3 సినిమా కోసం బుల్లితెర వాసులు ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. హిట్ 2 సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా అడివి శేష్, కార్తీలు సాలిడ్ క్యామియో పాత్రల్లో నటించారు.

Latest news