టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇపుడు చేస్తున్న పలు సినిమాలలో ఎన్టీఆర్ నుంచి మొదటగా రిలీజ్ అయ్యే సినిమా వార్ 2. బాలీవుడ్ సీనియర్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా రేంజ్లో పలు భాషలలో విడుదల అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్టన్నింగ్ యాక్షన్ డ్రామా నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన టీజర్ స్టైలీష్ యాక్షన్తో అదరగొట్టేసింది.ఇక తాజాగా దర్శకుడు అయాన్ ముఖర్జీ షేర్ చేసిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ మంచి డాషింగ్ లుక్ లో ఉన్నాడు. వార్ 2 సినిమాకి తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ని కూడా అయాన్ పంచుకున్నాడు. వార్ 2 స్క్రిప్ట్ తనని ఎంతో కదిలించి నందునే తాను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నానని తెలిపాడు. ఎన్టీఆర్, హృతిక్ ఇంకా కియారా అద్వానీలపై అయాన్ షేర్ చేసిన పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
వార్ 2 : సరికొత్త లుక్లో ఎన్టీఆర్… డైరెక్టర్ ఏం చేశాడో చూడండి…!
