టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతం తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కింగ్‌డమ్. ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ? అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో మంచి బజ్ ఉంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు మాత్రం ఆ సస్పెన్స్ అలాగే కొనసాగుతూ వస్తుంది. వాస్తవంగా మే 30న కింగ్డమ్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు.అయితే ఇప్పుడు ఆ డేట్ కు ఈ సినిమా రాకపోవచ్చు అన్న డౌట్లు మళ్ళీ మొదలయ్యాయి. దాదాపు కింగ్‌డమ్ సినిమా జులైకు వాయిదా పడినట్టు రూమర్లు మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మేకర్స్ అధికారింగా ప్రకటన చేస్తే తప్ప తెలియలేదు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఖచ్చితంగా మే లో వస్తుందని ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది కాస్త నిరాశపరిచే న్యూస్ అని చెప్పాలి.
విజయ్ దేవరకొండకు కొత్త కష్టం.. కింగ్‌డమ్‌పై డౌట్లు…!
