నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పక్కన పెడితే బాలయ్య మరో భారీ సీక్వెల్లో కూడా గెస్ట్ రోల్ చేయనున్నారు అన్నట్టు టాక్ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వచ్చిన జైలర్ సినిమా బ్లాస్టింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.మరి ఇప్పుడు ఈ సీక్వెల్లో బాలయ్య కూడా ఉన్నారని గత కొద్దికొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ సినిమాకు మరింత హైప్ తీసుకురాగా ఫైనల్ గా సాలిడ్ బజ్ వినిపిస్తోంది. బాలయ్య ఏకంగా జైలర్ 2 సినిమా కోసం 20 రోజులు కాల్షీట్లు ఇచ్చినట్టు సమాచారం. అంటే సినిమాలో బాలయ్య ఎంతసేపు కనిపిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా రజినీకాంత్ – బాలయ్య కలిసి ఒకేసారి వెండి తెర మీద కనిపిస్తే వెండితెర ఏ రేంజ్ లో షేక్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
జైలర్ 2 సినిమాకు బాలయ్య పెట్టిన కండీషన్ల లెక్క ఇదే… !
