MoviesRRR 2 ఉంది ... క్లారిటీ ఇచ్చేసిన రాజ‌మౌళి... !

RRR 2 ఉంది … క్లారిటీ ఇచ్చేసిన రాజ‌మౌళి… !

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో వచ్చిన భారీ మల్టీస్టారర్ సినిమా త్రిబుల్ ఆర్‌. మూడేళ్ల క్రితం వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో ఎలాంటి మానియా క్రియేట్ చేసిందో అంద‌రం చూశాం. ఈ సినిమా గురించి ఇప్ప‌ట‌కీ ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. రు. 1200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.నా కర్మ..వాడు హీరోనా, కుంటిగుర్రంతో పోలుస్తూ..టాలీవుడ్‌ స్టార్‌పై రాజమౌళి  హాట్ కామెంట్స్ | Tollywood star director ss Rajamouli made shocking  comments on jr ntr while he recalls ...అప్ప‌టి నుంచే త్రిబుల్ ఆర్‌కు సీక్వెల్ ఉంటుంద‌న్న టాక్ వినిపిస్తోంది. అయితే ఎట్ట‌కేల‌కు రాజ‌మౌళి త్రిబుల్ సీక్వెల్ ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చేశారు. కొద్ది రోజుల క్రితం రాజమౌళిపై వచ్చిన ఓటిటి డాక్యుమెంట‌రీ సినిమాలో పార్ట్ 2 ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఇప్పుడు ఫైన‌ల్‌గా దీనిని జ‌క్క‌న్న క‌న్‌ఫార్మ్ చేసేశారు. చ‌ర‌ణ్ షేర్ చేసిన రాజ‌మౌళి లేటెస్ట్ వీడియోలో రాజమౌళికి ఎదురైన RRR పార్ట్ 2 ప్రశ్నకి జక్కన్న ఉంది అంటూ సమాధానం ఇచ్చేశాడు. దీంతో త్రిబుల్ సీక్వెల్ ఉత్కంఠ వీడిపోయింది. మ‌రి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుందో ? చూడాలి.

Latest news