Moviesమంచు మ‌నోజ్‌కే నా స‌పోర్ట్‌.. తేల్చి చెప్పేసిన నారా రోహిత్‌...!

మంచు మ‌నోజ్‌కే నా స‌పోర్ట్‌.. తేల్చి చెప్పేసిన నారా రోహిత్‌…!

టాలీవుడ్ కుర్ర హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌లో మంచు మ‌నోజ్ ఇచ్చిన ఎమోష‌న‌ల్ స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. శివ‌య్యా అని పిలిస్తే రాడు… శివుడు నిర్మాత రూపంలోనో లేదా దర్శ‌కుడి రూపంలోనో వ‌స్తాడ‌ని ప‌రోక్షంగా త‌న అన్న మంచు విష్ణుకు కౌంట‌ర్ ఇచ్చాడ‌ని అంద‌రికి అర్థ‌మైంది. మంచు విష్ణు క‌న్న‌ప్ప సినిమాలో శివ‌య్యా అంటూ మంచు విష్ణు ప‌లికే కామెంట్‌కు ఇది కౌంట‌ర్‌గా క‌నిపిస్తోంది.మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ `భైరవం` ట్రైలర్‌.. హైలైట్స్ ఇవే - Manchu  manoj nara Rohith Bellamkonda Sai Sreenivas Bhairavam movie trailer out in  telugu - Asianet News Teluguఅయితే దీనిపై ఈ సినిమాలో న‌టించిన నారా రోహిత్ ఓ పోస్ట్ పెడుతూ మ‌నోజ్‌కే త‌న స‌పోర్ట్ అని తేల్చేశాడు. ‘మా భైరవం చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ సక్సెస్ చేసిన ఫ్యాన్స్, ఏలూరు ప్రజలకు ధన్యవాదాలు. ఈ ఈవెంట్‌లో మనోజ్ పవర్‌ఫుల్ స్పీచ్ హైలెట్‌‌గా నిలిచింది’ అని చెప్పుకొచ్చిన రోహిత్, మనోజ్ ను ఉద్దేశించి పోస్ట్ చేస్తూ.. ‘మనోజ్ స్పీచ్ నాకు కూడా ఇన్ స్పైర్ గా అనిపించింది. బాబాయ్ ఏదేమైనా కానీ, నీ కోసం నేనుంటాను. లవ్ యూ’ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. దీంతో నారా రోహిత్ కూడా మ‌నోజ్‌కే స‌పోర్ట్ అని తేల్చి చెప్పిన‌ట్లైంది. ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Latest news