Moviesనితిన్‌ను ఇబ్బంది పెడుతోన్న మెగాస్టార్ చిరంజీవి...!

నితిన్‌ను ఇబ్బంది పెడుతోన్న మెగాస్టార్ చిరంజీవి…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు యంగ్ హీరో నితిన్‌ను ఇబ్బంది పెట్టే ప‌ని చేస్తున్నారా ? అంటే ప‌రోక్షంగా అవును అన్న ఆన్స‌ర్లే ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. అస‌లు విష‌యంలోకి వెళితే టాలీవుడ్‌లో ప్రస్తుతం చాలా సినిమాలు రిలీజ్ డేట్లు వాయిదా వేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న విశ్వంభ‌ర సినిమా కూడా ఉంది. ఈ ప్రెస్టేజియ‌స్ సోషియో ఫాంట‌సీ సినిమాను ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట్ తెర‌కెక్కిస్తుండ‌గా… ఈ సినిమా ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదాలు ప‌డి జూలై 4న రిలీజ్‌కు రెడీ అవుతోంది.Nithin Thammudu Movie Archives - JAISW News Teluguవాస్త‌వంగా ఆ డేట్‌కు నితిన్ త‌మ్ముడు సినిమా షెడ్యూల్ అయి ఉంది. ప్ర‌మోష‌న్లు కూడా వేగంగా న‌డుస్తున్నాయి. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు వ‌కీల్‌సాబ్ ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే నితిన్ రాబిన్‌హుడ్ సినిమా వ‌చ్చి పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు త‌మ్ముడు మీదే నితిన్ ఆశ‌లు ఉన్నాయి. ఆ రోజే చిరు విశ్వంభ‌ర వ‌స్తే నితిన్ సినిమాను ప‌ట్టించుకునే వారే ఉండ‌రు. అందుకే ఇప్పుడు విశ్వంభ‌ర జూలై 4న వ‌స్తే నితిన్‌కు పెద్ద ఇబ్బందే అవుతుంది.

Latest news