Moviesఅల్లు అర్జున్ కోసం అట్లీ వేసిన ప్లాన్ చూస్తే ఫ్యీజులు అవుట్‌...!

అల్లు అర్జున్ కోసం అట్లీ వేసిన ప్లాన్ చూస్తే ఫ్యీజులు అవుట్‌…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను తమిళ దర్శకుడు అట్లీతో చేసేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 త‌ర్వాత ఆరు నెల‌ల పాటు గ్యాప్ తీసుకున్న బ‌న్నీ ఇప్పుడు అట్లీతో మాఫియా.. గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే అల్లు అర్జున్ పాత్ర‌పై ప‌లు వార్త‌లు సినీ స‌ర్కిల్స్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ విష‌యంలోనూ ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ వినిపిస్తోంది.Download Allu Arjun’s Smoldering Presence | Wallpapers.comప‌లు టైటిల్స్ ప‌రిశీలించిన అట్లీ చివ‌ర‌కు ఐకాన్ టైటిల్ ప‌రిశీలించిన‌ట్టు స‌మాచారం. గతంలో ఇదే టైటిల్‌లో అల్లు అర్జున్ ఓ సినిమాను అనౌన్స్ చేసినా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ టైటిల్‌పై వార్తలు రావ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Latest news