Moviesఅల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఏడుపు ఒక్క‌టే త‌క్కువ‌... !

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఏడుపు ఒక్క‌టే త‌క్కువ‌… !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా 2024 డిసెంబర్ 4న రిలీజై బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఈ సినిమా దెబ్బ‌తో బ‌న్నీ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది.. త‌మ హీరోకు అంత పెద్ద హిట్ వ‌చ్చినా కూడా బ‌న్నీ ఫ్యాన్స్ లో ఆ ఆనందం ఏ కోశాన క‌న‌ప‌డ‌డం లేదు. పుష్ప 2 త‌ర్వాత బన్నీ నెక్ట్స్ త్రివిక్ర‌మ్‌తో ప‌క్కా అన్నారు. త్రివిక్ర‌మ్ కూడా మ‌హేష్తో చేసిన గుంటూరు కారం త‌ర్వాత యేడాది కాలంగా బ‌న్నీ కోసం వెయిట్ చేస్తున్నాడు.Allu Arjun: From child artiste and Telugu hero to pan India star of  'Pushpa' fame - The Economic Timesక‌ట్ చేస్తే పుష్ప 2 హిట్ అయ్యాక ఇప్పుడు బ‌న్నీ .. త్రివిక్ర‌మ్‌ను ప‌క్క‌న పెట్టేసి అట్లీతో చేసేందుకే ఇష్ట‌ప‌డుతున్నాడ‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. అందుకు త‌గిన‌ట్టుగా అట్లీతో బ‌న్నీ నెక్ట్స్ ఎనౌన్స్ కూడా అయ్యింది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుందో తెలియ‌ట్లేదు. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌ను కూడా ఈ ప్ర‌శ్న బాగా వేధిస్తోంది.Atlee (director) - Wikiwandపుష్ప 1, 2 సినిమాల‌కే బ‌న్నీ ఏకంగా ఐదేళ్లు టైం తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆరు నెల‌లుగా ఖాళీగా ఉన్నాడు. ఇక‌నైనా బ‌న్నీ స్పీడ్ పెంచి మిగిలిన స్టార్ హీరోల మాదిరిగా వ‌రుస‌గా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో న‌టించాల‌ని బ‌న్నీ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Latest news