కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే రజనీకాంత్ తన తర్వాత సినిమా జైలర్ 2 షూటింగ్ కూడా ప్రారంభించేశాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకుడు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.జైలర్ 2 సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునను మేకర్స్ అప్రోచ్ అయినట్లు టాక్ ? ఇప్పటికే రజనీతో కలిసి ‘కూలీ’లో నాగ్ నటించాడు. దీంతో జైలర్ 2 కోసం ఆయనను విలన్ పాత్ర కోసం మేక్రస్ సంప్రదిస్తున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాగార్జున తన నిర్ణయం త్వరలోనే చెపుతానని అన్నాడని తెలుస్తోంది. ఏదేమైనా నాగ్ రజనీని డీ కొట్టే విలన్ పాత్ర అంటే స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం.
‘ జైలర్ 2 ‘ లో రజనీనీ ఢీ కొట్టే విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో…!
