నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ సీక్వెల్ సినిమా అఖండ 2. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సినిమాపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బాలయ్యపై వినిపిస్తుంది. నిజానికి బాలయ్య సినిమా రెండు షేడ్స్ లో మాత్రమే అంటే దాదాపు రెండు లుక్స్‌లో మాత్రమే కనిపిస్తారని తెలుస్తోంది.కానీ బోయపాటికి మరో ప్లాన్ కూడా ఉందట. ఎవ్వరూ ఊహించని విధంగా బాలయ్యపై మూడో లుక్ కూడా ఉందని తెలుస్తుంది. ఇది కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే రేంజ్‌లో ఉంటుందంటున్నారు. మరి ఈ లుక్‌పై టాక్ ఎప్పుడు రివీల్ అవుతుందో చూడాలి. బాలయ్య బర్త్ డే కానుకగా జూన్‌లో ఈ టీజర్ రిలీజ్ అవుతుందంంటున్నారు. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్.
అఖండ 2 లో రెండు కాదు.. మూడు.. బాలయ్య మార్క్ సర్‌ప్రైజ్…!
