Moviesహీరోయిన్ రాశీ ఖ‌న్నాకు తీవ్ర గాయాలు... అస‌లేం జ‌రిగింది...!

హీరోయిన్ రాశీ ఖ‌న్నాకు తీవ్ర గాయాలు… అస‌లేం జ‌రిగింది…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోల‌ను ఆమే స్వ‌యంగా పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో రాశీ ఖ‌న్నా ముక్కు నుంచి ర‌క్తం కారుతోంది. దీంతో ఒక్క‌సారిగా ఆమె అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. రాశీ ఖ‌న్నా ముక్కుతో పాటు కాళ్ల‌కు, చేతుల‌కు కూడా దెబ్బ‌లు తగిలి ర‌క్తం కారుతోంది. ఓ సినిమా షూటింగ్‌లో రిస్కీ యాక్ష‌న్ సీన్ల‌లో రాశీ ఖ‌న్నా పాల్గొంది. దీంతో ఆమెకు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ర‌క్తం కారిన‌ట్టు తెలుస్తోంది.అబ్బాయి లవ్ లెటర్ రాస్తే మా అమ్మకే ఇచ్చా.. అది స్టుపిడ్.. ఆ రూమర్ తో రాశి  షాక్! | Rashi Khanna responds on rumors related to Anil Ravipudi - Telugu  Filmibeatప్ర‌స్తుతం రాశీ బాలీవుడ్ లో ఫర్జీ-2 అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవ‌లే రాశీ ఖ‌న్నా త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ నా పెళ్లి పై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి నిజం కాదు. అయితే, నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది. కానీ నా పెళ్లికి ఇంకా టైం ఉంద‌ని.. అది ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ కావ‌డంతో దాని గురించి తాను ఇక్క‌డ డిస్క‌స్ చేయ‌లేను అని రాశీ ఖ‌న్నా తెలిపింది.

Latest news