Moviesఏపీ పోలిస్‌గా బాల‌య్య రోల్‌... !

ఏపీ పోలిస్‌గా బాల‌య్య రోల్‌… !

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అఖండ 2 సినిమాలో న‌టిస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి డాకూ మ‌హారాజ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక అఖండ లాంటి సూప‌ర్ హిట్ సినిమా తెర‌కెక్కించిన బోయ‌పాటి ఇప్పుడు అఖండ 2 ను ఓ రేంజ్‌లో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ట‌. ఇదిలా ఉంటే అఖండ 2 తో పాటు బాల‌య్య జైల‌ర్ 2 సినిమాలోనూ న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.Jailer 2 to hit the big screens during this time?ర‌జ‌నీకాంత్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా జైల‌ర్‌. ఇప్పుడు జైల‌ర్‌కు సీక్వెల్‌గా జైల‌ర్ 2 తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో బాల‌య్య పాత్ర ఏపీ పోలిస్‌గా ఉండ‌బోతోంద‌ట‌. బాల‌య్య ఏపీ పోలిస్ పాత్ర అంటే థియేట‌ర్లు ఎలా షేక్ అయిపోతాయో తెలిసిందే. మామూలుగానే ర‌జ‌నీని.. బాల‌య్య‌ను ఒకేసారి స్క్రీన్ మీద చూస్తే ఆ మ‌జాయే వేరుగా ఉంటుంది. మ‌రి అందులోనూ ఏపీ పోలిస్ పాత్ర అంటే బాల‌య్య ర‌చ్చ రంబోలా ఆడేస్తాడ‌నే చెప్పాలి.

Latest news