Movies' ఓదెల 2 ' ప్రి రిలీజ్ బిజినెస్ .. త‌మ‌న్నా...

‘ ఓదెల 2 ‘ ప్రి రిలీజ్ బిజినెస్ .. త‌మ‌న్నా టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా…!

టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ గ‌త 20 ఏళ్ల‌కు పైగా త‌న కెరీర్ కొన‌సాగిస్తూ వ‌స్తోంది. తెలుగుతో పాటు ఎన్నో భాష‌ల్లో సినిమాలు చేసి సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టారు త‌మ‌న్నా. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా చేసిన సినిమా ఓదెల 2. కొంత కాలం క్రితం హెబ్బా ప‌టేల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కి ఓదెల సినిమాకు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కొన‌సాగింపుగా ఓదెల 2లో త‌మ‌న్నా న‌టించింది. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయ్యింది.Odela 2 Twitter Review: ఓదెల 2 ట్విట్టర్ రివ్యూ | Odela 2 Twitter Review in  Telugu: Tamannaah Bhatia hits bully eye - Telugu Filmibeatఇక ఈ సినిమాపై ఉన్న హైప్ నేప‌థ్యంలో మంచి ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఒక్క‌ నైజాం ఏరియాలో దాదాపు 3.5 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సీడెడ్ ఏరియాలో ఒక కోటి, ఆంధ్రలో నాలుగు కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 8.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాఓవ‌ర్సీస్‌లో క‌లుపుకుంటే మ‌రో రు. 2 కోట్లు అద‌నంగా ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.మహా కుంభమేళాలో తమన్నా 'ఓదెల 2' టీజర్‌ | Odela 2 Movie Teaser Release Update  | Sakshiటోట‌ల్ వ‌రల్డ్ వైడ్‌గా రు.10.50 కోట్ల టార్గెట్‌తో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇత‌ర భాష‌ల్లో నిర్మాత‌లు ఓన్ రిలీజ్‌కు వెళుతున్నార‌ట‌. ఈ సినిమా రు. 11 కోట్ల మేర షేర్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అయిన‌ట్టు లెక్క‌.

Latest news