Moviesఇట్స్ ఫిక్స్ : ' అంఖండ 2 ' బ్లాస్టింగ్ డేట్‌లో...

ఇట్స్ ఫిక్స్ : ‘ అంఖండ 2 ‘ బ్లాస్టింగ్ డేట్‌లో నో ఛేంజ్ ..!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2. అఖండ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న అఖండ 2 కోసం అంద‌రూ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ సారి పాన్ ఇండియా ఆడియెన్స్‌ను సైతం అఖండ 2 తాండ‌వం సినిమాతో థియేట‌ర్లలో పూన‌కాలు తెప్పించే ప్లాన్‌లో ఉన్నాడు.ఇక ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ రోజు బోయ‌పాటి శ్రీను పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌న‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ విషెస్‌తో పాటు అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో కొద్ది రోజుల నుంచి వినిపిస్తోన్న పుకార్ల‌కు సైతం బోయ‌పాటి చెక్ పెట్టేశారు.అఖండ 2 – తాండ‌వం సినిమా సెప్టెంబర్ రేస్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లినట్టుగా పలు రూమర్లు వినిపించాయి. దీనిపై ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. ఈ రూమ‌ర్ల‌లో నిజం లేద‌ని.. సెప్టెంబ‌ర్ 25న ద‌స‌రా కానుక‌గానే ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రాబోతోంద‌ని క‌న్‌ఫార్మ్ చేసేశారు. సో ఇక ద‌స‌రా కు అఖండ 2 తాండవంతో థియేట‌ర్ల‌లో పూన‌కాలు త‌ప్ప‌వు.

Latest news