నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘ అఖండ ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్ జార్జియాలో షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ అక్కడకు బయలు దేరి వెళ్లింది.ఈ షెడ్యూల్ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఓ బాలీవుడ్ నటుడు ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవుతున్నాడట. ఆ నటుడు ఎవరో కాదు సీనియర్ హీరో సన్నీడియోల్ అంటున్నారు. సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నీ డియోల్ క్యారెక్టర్ ద్వారా.. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓ భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఈ ట్విస్ట్‌కు అఖండ 3 సినిమాకు లింక్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు టాక్ ?
సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.