Moviesఆ క్రేజీ హీరోయిన్ విడాకులు తీసుకుంటుందా ? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..!

ఆ క్రేజీ హీరోయిన్ విడాకులు తీసుకుంటుందా ? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..!

మలయాళ బ్యూటీ భావన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే .. గోపీచంద్ ఒంటరి , శ్రీకాంత్ మహాత్మా వంటి సినిమాల్లో ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అందాల బ్యూటీ .. అయితే ఈ హీరోయిన్ ఎక్కువగా తమిళ , మలయాళ సినిమాల్లోనే నటించింది .. అలాగే కొన్ని కన్నడ సినిమాలు కూడా చేసింది .. అయితే ఊహించిన విధంగా ఓ స్టార్ హీరో నిర్వాకం వల్ల ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది .. గత కొన్నేళ్ల క్రితం కొందరు దుండగులు భావనను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు . ఇక దాంతో క్రమంగా ఈమె సినిమాలు చేయడం మానేసింది ..Bhavana (actress) - Wikipediaఇక తర్వాత 2018లో ప్రముఖ కన్నడ నిర్మాత నవీన్‌ రమేశ్‌ను పెళ్లి చేసుకుంది .. ప్రస్తుతం ఈ జంట ఎంతో అన్యోన్యంగా హ్యాపీగా ఉంటుంది . అయితే ఇప్పుడు తాజాగా భావన తన భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో భావన తన పై వస్తున్న విడాకులు వార్తల పై గట్టిగా రియాక్ట్ అయింది . నేను విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు .. అలాగే నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం నాకు ఇష్టం లేదు ..Bhavana: విడాకుల ప్రచారంపై పెదవి విప్పిన 'మహాత్మ' నటి | actress-bhavana -breaks-silence-on-diveroce-rumoursఅందులో భాగంగానే నా భర్తతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టడం లేదు .. ఇలా చేయకపోవడం వల్లే ఇప్పుడు కొందరు నా విడాకులు గురించి ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారు .. మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గోప్యతను పాటిస్తా నేను అనుకోకుండా ఫోటోలు పోస్ట్ చేసిన ఏదో తప్పు జరిగిందని వార్తలు సృష్టిస్తున్నారు అలా అని మా బంధం బలంగా ఉందని నిరూపించడానికి మేము సెల్ఫీలు పోస్ట్ చేయాల్సిన పని లేదు కదా అంటూ విడాకులు వార్తలను కొట్టి పడేసింది భావన .

Latest news