Movies300 కోట్ల హీరోకు డైరెక్టర్లు కరువయ్యారు .. ఇది ఎక్కడి విడ్డూరంరా...

300 కోట్ల హీరోకు డైరెక్టర్లు కరువయ్యారు .. ఇది ఎక్కడి విడ్డూరంరా బాబు ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హిట్‌ అందుకుంటే సరిపోదు. ఆ హిట్ తర్వాత ప్రతి ఒక్క సినిమాని హిట్ గా మార్చే సత్తా ఉండే నిర్ణయాలే తీసుకోవాలి. అయితే ఇది యంగ్ హీరోల విషయంలో ఉంటుంది. కానీ సీనియర్స్ కూడా ఇదే దారిలో వెళ్తే మాత్రం కాస్త విచిత్రంగా ఉంటుంది. సీనియర్స్ హీరోస్ తమ జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద విజయాలు చూసి ఉంటారు. తాజాగా విక్టరీ వెంకటేష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా సరైన బ్లాక్ బాస్టర్ లేని వెంకీకి రీసెంట్ గానే ‘సంక్రాంతికి వస్తున్నాం ‘అనే సినిమా తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది.Sankranthiki Vasthunam ott: 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ స్ట్రీమింగ్‌  డేట్‌ కూడా ఫిక్స్‌.. | sankranthiki-vasthunam -on-zee5-and-zee-telugu-at-the-same-timeపండక్కి సినిమా హిట్ అవుతుంది అని తెలుసు కానీ ఇంత రేంజ్ లో హిట్ అవుతుంది.. అని మాత్రం ఎవరూ ఊహించలేదు .అంత ఎందుకు వెంకటేష్, అనిల్ రావిపూడి కూడా తమ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుంద‌ని ఎవ‌రు ఉహించ‌లేదు . అలాంటి హిట్ తర్వాత వెంకటేష్ ఎలాంటి సినిమాలను చూసి చేసుకోవాలని అనే విషయంలో కన్ఫ్యూజ్ లో ఉన్నాడు వెంకటేష్. ఈయన తర్వాత సినిమా కోసం చాలామంది నిర్మాతలు వెయిట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి .ఇప్పటికే సొంత ప్రొడక్షన్’ సురేష్ ప్రొడక్షన్’ తో పాటు సితార ఎంటర్టైన్ ,మైత్రి మూవీ మేకర్స్ వెంకటేష్ కు అడ్వాన్సులు ఇచ్చారు. ఏదో ఒక నిర్మాణ సంస్థ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు . వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ తర్వాత దాదాపు 25 కథలను విన్నానని ఏ ఒక్కటి తనకు నచ్చలేదు అన్నాడు వెంకీ.వెంకీ గంద‌ర‌గోళం - Telugu 360 teఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అయితే ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తుంది .రవితేజ తో ప్రస్తుతం మాస్ జాతర సినిమా తెరకెక్కిస్తున్న భాను భోగవరపు చెప్పిన ఒక కథకు వెంకి ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. దీంట్లో ఫ్యామిలీ కామెడీ ఎక్కువగా ఉండడంతో భాను చెప్పిన కథను తీసుకుంటాడా లేక వెంకీ మరోవైపు సురేందర్ రెడ్డి చెప్పిన కథ కూడా ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఏజెంట్ మూవీ తర్వాత కనిపించడమే మానేశాడు సురేందర్ రెడ్డి .వెంకీ ఏ డైరెక్టర్ ని చూస్ చేసుకుంటాడా అని వార్త సోషల్ మీడియాలో ప్రజెంట్ హ‌ట్ టాపిక్ గా మారింది .. ఇక మ‌రి వెంకిమామ వీరోలో ఎవ‌రిని ఓకే చేస్తాడో చూడాలి.

Latest news