మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మల్టీస్టారర్‌లు వచ్చాయి .. ప్రధానంగా మహేష్ , వెంకటేష్ కలిసిన నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత నుంచి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు .. అంతకు ముందు ఒకప్పటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ ,కృష్ణ ,శోభన్ బాబు వంటి హీరోలు కలిసి ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు .. ఆ తర్వాత వచ్చిన బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి వారు ఎప్పుడు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు .. కానీ ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్, మహేష్ ,అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ..ఇదే క్రమంలో గతంలో మహేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసిన సమయంలో ..ఓ క్రేజీ మల్టీస్టారర్ ఆయన వద్దకు వచ్చింది .. ఇందులో మహేష్ బాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఆ సినిమా చేయాలని ఓ అగ్ర దర్శకుడు ప్రయత్నం చేశారు .. ఇద్దరికీ కథ చెప్పి ఓకే చేయించాడు. కానీ అది చివరికి షూటింగ్ వరకు వెళ్లకుండా కథా చర్చల్లోనే ఆగిపోయింది . ఇంతకీ ఆ అగ్ర దర్శకుడు మరెవరో కాదు .. మహేష్ , పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ .. వీరిద్దరితో కలిసి సినిమా చేయాలని ఒక కథను సిద్ధం చేసుకుని ఈ ఇద్దరు హీరోలకు కూడా వివరించారు .. ఇద్దరికీ నచ్చింది .. సినిమాను మొదలు పెడతాకి రెడీ అవుతున్న సమయంలో హఠాత్తుగా మూవీ వాయిదా పడింది.
స్టోరీ ప్రకారం ఇద్దరు హీరోల అభిమానులను ఆనందపరుస్తూ కథను నడిపించడం అనేది కత్తి మీద పాముల మారింది ఏమాత్రం తేడా వచ్చిన తమ హీరోని తక్కువ చేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పాటు అది పెద్ద వివాదానికి దారి తీస్తుందని త్రివిక్రమ్ కు అనిపించింది . ఇక దాంతో సినిమా తీయడం కన్నా పూర్తిగా ఆపేయడం మంచిదని భావించి మహేష్ బాబుకు పవన్ కళ్యాణ్ కు అసలు విషయం చెప్పారు .. వారు కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమా అలాగే ఆగిపోయింది . ఇలా ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేసి సినిమా వచ్చి ఉంటే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యవని సిని విశేషకులు కూడా అంటున్నారు ..
అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ అత్తారింటికి దారేది చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు అలాగే గత సంవత్సరం మహేష్ తో కూడా గుంటూరు కారం తో భారీ ఫ్లాఫ్ ఇచ్చాడు .. ఈ సినిమా చేయటంపై మహేష్ బాబు అభిమానులు కూడా త్రివిక్రమ్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు .. దాంతో కొన్ని నెలల పాటు త్రివిక్రమ్ బయట ఏ కార్యక్రమాల్లో కూడా కనిపించలేదు ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి రేడి అవుతున్నాడు . ఇప్పుడు ఈ సినిమా కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది ..ప్రస్తుతం అల్లు అర్జున్ , అట్లీ తో ఓ సినిమా చేయబోతున్నాడు .
మహేష్ , పవన్ కళ్యాణ్ కాంబోలో మిస్సయిన క్రేజీ మల్టీస్టారర్ ఇదే ..?
