టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ పుష్ప – 2 ’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధించిన వసూళ్ల దెబ్బకు బన్నీ స్టామినా ఏమిటో దేశ వ్యాప్తంగా ఫ్రూవ్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ, ప్రస్తుతం తన తర్వాత సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, బన్నీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో సినిమా అనగానే అంచనాలు మామూలుగా లేవు. ఇక తన తర్వాత సినిమా బన్నీ తోనే ఉంటుందని ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశాడు త్రివిక్రమ్. పుష్ప – 2 సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. త్రివిక్రమ్ ఈ సారి చాలా బలమైన కథతో రాబోతున్నాడట.
గుంటూరు కారం అనుకున్న స్థాయిలో మెప్పించలేదు. అందుకే ఈ సారి స్టోరీ రైటింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. దీంతో ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ సినిమా ఉంటుంది.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా.. !
