కొంతమంది హీరోల దగ్గర కొన్ని రూల్స్ పనిచేయవు.. ఎంత ప్రయత్నించినా అవి సక్సెస్ కావు. అలాంటి హీరోలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. అయితే ప్రభాస్ దగ్గర ఒక కండిషన్ పెట్టాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం సందీప్ – ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్‌ను బల్క్ కాల్ షీట్లు కోరాడట సందీప్. స్పిరిట్ సినిమా కోసం బల్క్ కాల్ షీట్లు కావాలని.. కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉండేందుకు పనిచేయాలని కండిషన్ పెట్టాడట.వాస్తవంగా ఇది సాధ్యమయ్యే పనైనా అన్న సందేహాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ అన్ని పెద్ద సినిమాలే.. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సెట్స్ మీద ఉంది. ఫౌజీ షూటింగ్ నడుస్తోంది. ఇలాంటి టైంలో స్పిరిట్ సినిమా కోసం బల్క్ కాల్ షీట్లు కోరటం అత్యాశే అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రభాస్ సన్నబడ్డాడు.. చేసేది పోలీస్ పాత్ర కాబట్టి దానికి తగినట్టుగా ఫిజిక్ మార్చుకుంటున్నాడు. రీసెంట్గా ప్రభాస్ కొత్త లుక్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
మరోవైపు ప్రభాస్ పోలీస్ గెటప్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా ఆలస్యం అయింది. లెక్క ప్రకారం గత నెలలో షూటింగ్ ప్రారంభం కావాలి.. ఈ వేసవిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. సినిమాకు సంబంధించి చాలా రోజుల క్రింద మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టిన దర్శకుడు తాజాగా నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేశారు. ఇక సెట్స్ మీదకు వెళ్ళటం ఒకటే మిగిలి ఉంది.