ఇక మన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది అగ్ర హీరోలు ఉన్నరు అయితే అభీమనులకు మాత్రం వారిలో స్టార్ హీరోలు మాత్రమే ఎక్కువగా గుర్తుకొస్తారు .. అందుకు కారణం ఏదైనా కూడా వాళ్ళు చేస్తున్న సినిమాలు మాత్రమే ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతూ భారీ విజయాలు సాధిస్తూ ఉంటాయి .. స్టార్ హీరోల సినిమాలను థియేటర్లో చూడ్డానికి అభిమానులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అందుకే దర్శకులు సైతం స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
అలాగే మన చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా కూడా గట్టిగా ఉంది .. రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ సినిమా చేసి గ్లోబల్ బ్లాక్ బస్టర్ సాధించడంతో పాటు ఈ సినిమాతో ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డును అందించాడు .. అలాగే ఈ సినిమా తర్వాత నుంచి ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ కథలను రాస్తున్నారు .. వాటికి స్టార్ హీరోలు సైతం ఒకే చెబుతూ సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. అయితే నటసింహం నందమూరి బాలకృష్ణ , సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భారీ రేంజ్ లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు.
అలాంటిది గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు .. వీరి ఇమేజ్కు సరిపడా కథను కూడా రెడీ చేసిన పూరి జగన్నాథ్ ఇద్దరు హీరోలను మెప్పించడంలో మాత్రం తడబడ్డాడు .. అందువల్లే ఈ సినిమా సెట్ట్ కాలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
నిజానికి మహేష్ బాబు లాంటి హీరోను స్టార్ హీరోగా చేసిన దర్శకుడు కూడా పూరి జగన్నాథ్ .. పోకిరి , బిజినెస్‌మాన్ లాంటి సినిమాలతో మహేష్ బాబుని స్టార్ హీరోగా మార్చి అయన కంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసి పెట్టాడు ..ఇక బాలకృష్ణలో కూడా పైసా వసూల్ సినిమా చేసి మంచి విజయవం అందుకున్న పూరి జగన్నాథ్ .. వీళ్ళిద్దరితో మల్టీ స్టారర్ సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయాలని అనుకున్నప్పటికీ అది కుదరలేదు. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ సినిమా వస్తుందో లేదో చూడాలి.