టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా ఎందుకో గాని రావాల్సినంత క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. నితిన్ సరసన రాబిన్ హుడ్ – మాస్ మహారాజ రవితేజ సరసన మాస్ జాతర సినిమాలలో నటిస్తోంది. ఆమె ఈ ఇద్దరు హీరోలతో గతంలో నటించింది. రవితేజ సరసన ధమాకా లాంటి సూపర్ హిట్ సినిమాతో పాటు … నితిన్ కు జోడిగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె నటిస్తున్న నితిన్ – రవితేజ సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ లో ఆమెకు కొన్నాళ్ల పాటు తిరుగే ఉండదు.ఇక శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి శ్రీలీల ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే ఆమె మరో బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఎంపికైందట. ఇలా బాలీవుడ్లో తన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండో సినిమాకు ఓకే చెప్పటం అది క్రేజీ కుర్ర హీరో సరసన కావడంతో ఇది ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ అప్ ద టౌన్ గా మారింది. రష్మిక యానిమల్ – పుష్ప 2 లాంటి సినిమాలు తో ఒక్కసారిగా బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక శ్రీలల బాలీవుడ్ లో చేస్తున్న ఈ రెండు సినిమాలు హిట్ అయితే కచ్చితంగా రష్మిక దూకుడుకు చెక్ పడుతుందని చెప్పాలి.
రష్మికకు షాక్ ఇచ్చే స్కెచ్ వేసిన శ్రీలీల.. ఏం చేసిందో చూడండి..!
