మన తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్స్ లిస్టులో అందరికంటే ముందు వరసలో సంయుక్త మీనన్ పేరు ఉంటుంది .. మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె తెలుగులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది .. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి .. ఈ సినిమా తర్వాత సంయుక్త నటించిన బింబిసార , సార్ , వీరపాక్ష సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి .. వీటిలో విరూపాక్ష సినిమాలో నెగటివ్ రోల్ కూడా చేయగలను అని నిరూపించుకుంది ఈ బ్యూటీ .. అయితే మంచి సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోకుండా కేవలం తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను మాత్రమే చేయడానికి సంయుక్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది.అయితే ఇప్పుడు రీసెంట్గా ఈమె ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేసింది .. ఇక అవి సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి .. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మాట్లాడుతూ నాకు పెద్దగా చెడు అలవాట్లు ఏమీ లేవు .. కానీ వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కాస్త వైన్ తాగుతాను .. డ్రింక్ తీసుకోవడం వల్ల నాకు కాస్త రిలాక్స్ గా ఉంటుంది .. ఇది నా లైఫ్ స్టైల్ కారణంగా అలవాటయింది .. ఇక ప్రతి ఒక్క మనిషికి వారికి సంబంధించిన ఒక లైఫ్ స్టైల్ కారణంగా కొన్ని కొత్త అలవాట్లు వస్తూ ఉంటాయి .. నాకు ఈ అలవాటు వచ్చింది అంటూ సంయుక్త చెప్పకు వచ్చింది .. ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడే హీరోయిన్లు ఉన్న ఈ రోజుల్లో ఇలా నిజాలు మొహమాటం లేకుండా ఒప్పుకోవటం కేవలం సంయుక్తమీనన్‌కి మాత్రమే చెల్లిందంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఈమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక సంయుక్త సినిమాల విషయానికి వస్తే గత రెండు సంవత్సరాలుగా యంగ్ హీరో నిఖిల్ తో పీరియాటికల్ మూవీ స్వయంభులో హీరోయిన్గా నటిస్తుంది .. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది .. సినిమా తర్వాత ఈమె శర్వానంద్ తో కలిసి నారి నారి నడుమ మురారి అనే సినిమాలో కూడా నటిస్తుంది .. ఈ రెండు సినిమాలు తో పాటు ఈమె మలయాళం లో మూడు సినిమాల్లో హీరోయిన్ నటిస్తుంది .. అలాగే అఖండ 2 లో కూడా సంయుక్త నటిస్తుంది .. ఈమె తన కెరియర్ లో నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది.
నాకు అలాంటి అలవాటు ఉంది అంటూ షాకింగ్ కామెంట్ చేసిన సంయుక్త .. దెబ్బకు మైండ్ బ్లాక్..!
