కొరటాల శివ ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు. అలాంటి కొరటాల శివ ఆచార్య రూపంలో పెద్ద డిజాస్టర్ సినిమా ఇచ్చారు. ఆచార్య కొరటాల క్రేజ్ ఒక్క సారిగా పాతాళంలోకి తీసుకువెళ్ళింది. ఆచార్య తర్వాత చాలా కసితో జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా తెరకెక్కించిన కొరటాల ఒక్కసారిగా బ్యాక్ బౌన్స్ అయ్యారు. దేవరకు సీక్వెల్గా దేవర 2 కొరటాల తెరకెక్కించే పనిలో ఉన్నారు. అయితే కొరటాలకు మరో రెండేళ్లపాటు వెయిటింగ్ తప్పేలా లేదు. ఇప్పటికే దేవర థియేటర్లోకి వచ్చి ఆరు నెలలు దాటుతోంది.అయితే జూనియర్ ఎన్టీఆర్ మరో రెండేళ్ల పాటు ఖాళీగా ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి పాన్ ఇండియా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ప్రశాంత్ నీల్ సినిమా ఎలా లేదన్న ఏడాదికి పైనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ .. పోస్ట్ ప్రొడక్షన్ .. ప్రమోషన్లు రిలీజ్ ఎలా చూసుకున్నా ఏడాదిన్నర టైం పడుతుంది.
వార్ 2 ముగిసి ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి అయ్యేసరికి రెండేళ్లు టైం పడుతుంది. అంటే 2025 – 2026 సెకండ్ హాఫ్ వరకు జూనియర్ ఎన్టీఆర్ వారు 2 , ప్రశాంత్ నీల్ సినిమాలకే డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక 2026 చివర్లో దేవర 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. సో దేవర 2 అప్పుడు మొదలుపెట్టిన 2027 లేదా 2028 దాకా తీసుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా కొరటాల శివ మరో రెండేళ్ల పాటు ఖాళీగా ఉండక తప్పని పరిస్థితి. ఈలోగా దేవర 2 మీదే వర్క్ చేసేలా కొరటాల ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.