టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేశాడో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం చూసింది. టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులకు రారాజుగా నిలిచిపోయాడు. అల్లు అర్జున్ తన తర్వాత సినిమా కోసం రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్ తర్వాత సినిమా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒకటి .. ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే అట్లి సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని .. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా అట్లీ హీరోయిన్‌ను కూడా ఓకే చేశాడట. దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా నటించి తొలి సినిమాతోనే సౌత్ ఇండియాలో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశాడట అట్లీ. గ్లామర్ తో పాటు చక్కని అభినయంతో ఆమె ఆకట్టుకుంటుంది. అట్లీ – బన్నీ సినిమాలో జాన్వీ ఉంటే అటు నార్త్ ఇండియా లో కూడా మంచి క్రేజ్ వస్తుంది. అందుకే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.