ప్రస్తుతం బాలీవుడ్ సినిమాని షేక్ చేస్తున్న సినిమా ఛావా. బాలీవుడ్ క్యూట్ క్రేజీ హీరో విక్కీ కౌశల్ హీరోగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఛావా సినిమా శంబాజీ మహరాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించారు. ఈ సినిమా ఒక్క హిందీలోనే రిలీజ్ అయినా కూడా భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుని పాన్ ఇండియా లెవల్లో అదరగొడుతోంది.
అయితే తెలుగు ఆడియెన్స్‌లో కూడా ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలని ఇక్కడ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డబ్బింగ్ కోసమే ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ వైరల్‌గా మారింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంకా కన్పార్ట్ కాలేదు. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ అందిస్తున్నారన్న రూమర్లు బయటకు వచ్చేశాయి.అయితే సినిమా యూనిట్ నుంచి ఇంకా తెలుగు డబ్బింగ్ విషయంలో ఎలాంటి మూమెంట్ అయితే లేదు. సో ఈ సినిమాకు ఎన్టీఆర్ డబ్బింగ్ అందిస్తున్నాడు అనే మాటలో కూడా ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఒక వేళ అందిస్తే ఆ ఇంఫాక్ట్ అయితే ఛావా తెలుగు వెర్షన్ మీద చాలా గట్టిగా ఉంటుందనే చెప్పాలి.