Moviesజై బాల‌య్యా... అన్న‌కు చెల్లి భువ‌నేశ్వ‌రి పార్టీ... ఈ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులకు...

జై బాల‌య్యా… అన్న‌కు చెల్లి భువ‌నేశ్వ‌రి పార్టీ… ఈ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులకు స్పెష‌ల్ ఆహ్వానం..!

ప్రముఖ సినీ హీరో.. హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా రాజకీయ.. సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఓ భారీ పార్టీ జరగబోతుంది. ఆ పార్టీ ఇస్తుంది ఎవరో ?కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి బాలకృష్ణ సోదరి నారా భువనేశ్వరి కావటం విశేషం. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరుగుతున్నట్టు తెలుస్తోంది.Nara And Nandamuri Special Moment | Nara And Nandamuri Special Momentఈ పార్టీకి చాలా క్లోజ్ సర్కిల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందింది. నందమూరి, నారా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు నంద‌మూరి ఫ్యామిలీ సర్కిల్ .. నారా ఫ్యామిలీ సభ్యులకు క్లోజ్ సర్కిల్ జనాలకు మాత్రమే ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. వారితో పాటు బాలకృష్ణతో ఇటీవల సినిమాలు తీసిన వీర సింహారెడ్డి – భగవంత్‌ కేసరి – డాకూ మహారాజ్ – అఖండ 1 – అఖండ 2 సినిమాల నిర్మాతలు దర్శకులకు కూడా టాలీవుడ్ నుంచి ఆహ్వానం అందింది.పద్మ అవార్డు ప్రకటించిన తర్వాత బాలకృష్ణకు ఇది తొలి సన్మానం. ఇకపై ఇంకా చాలా పార్టీలు.. సన్మానాలు ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ వైపు నుంచి కూడా ఒక పార్టీ ఉంటుంది.. దాన్ని ఎవరు ఎలా ?నిర్వహిస్తారు అన్నది చూడాల్సి ఉంది.

Latest news