Moviesఈటీవీ విన్ ఓటీటీ వైర‌ల్ : ప్రేమ - స్నేహం -...

ఈటీవీ విన్ ఓటీటీ వైర‌ల్ : ప్రేమ – స్నేహం – బ్రేక‌ప్ కాన్సెఫ్ట్‌తో స‌మ్మేళ‌నం.. !

ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన ‘సమ్మేళనం’ సిరీస్ ఈటీవీ విన్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలో బాగానే ట్రెండ్ అవుతోంది.ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో సునయని. బి, సాకెత్. జె నిర్మాతలుగా తరుణ్ మహాదేవ్ తెరకెక్కించిన సిరీస్ ‘సమ్మేళనం’. ప్రస్తుతం ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. కొత్త మొహాలతో ఇలాంటి సున్నితమైన అంశాలను జోడించి డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ సిరీస్‌ను అద్భుతంగా మలిచాడు. ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జొప్పించలేదు.ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మూడో ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ క్లీన్ సిరీస్‌కు శ్రావణ్ జీ కుమార్ విజువల్స్, శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ సంగీతం ప్రధాన బలం. మరీ ముఖ్యంగా శరవణ వాసుదేవన్ బీజీఎం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Latest news