ఎప్పటినుంచో వార్తల్లో ఉంటూ వస్తుంది విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా. సితార సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటివరకు టైటిల్ తెలియదు.. టీజర్ లేదు.. అటు గౌతమ్ అభిమానులు .. ఇటు విజయ్ దేవరకొండ అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ ను ఈ సినిమా మలుపు తిప్పుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. టైటిల్ దొరకటం ఒక సమస్య … అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడం మరో సమస్య. అందుకే టీజర్ విడుదల ఆలస్యం అవుతుందన్న గుసగుసలు ఉన్నాయి.సినిమా విడుదల తేదీ అనధికారికంగా బయటికి వచ్చేసింది. మే నెలాఖరున విడుదల. మరి ఇప్పుడైనా టీజర్ ఇవ్వాలి కదా.. అందుకే త్వరలో టైటిల్ డిసైడ్ చేస్తున్నాం.. టీజర్ వస్తుంది అనేలా నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం రకరకాల టైటిల్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. యుద్ధం అనే మీనింగ్ వచ్చేలా ఇంగ్లీష్ పదం ఏమైనా ఉందా ? అని వెతుకుతున్నారట. అలాగే మాఫియా సామ్రాజ్యానికి సరైన ఇంగ్లీష్ పదం కోసం వెతుకుతున్నారు. టైటిల్ ఫైనల్ కాగానే టీజర్ డేట్ తో అనౌన్స్మెంట్ వస్తుంది.
ఈ సినిమాను చాలా భారీ స్థాయిలో నిర్మించారు. మొదట ఒక భాగం అనుకున్నది కాస్త .. ఇప్పుడు రెండు పార్టులుగా మార్చారు. తొలిభాగం మేలో విడుదల అవుతుంది. అసలే విజయ్ దేవరకొండ కెరియర్ గత ఐదు సంవత్సరాలుగా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వరుసపెట్టి డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నాడు. లైగర్ – ఖుషి – ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండ క్రేజ్‌ను ఆకాశం నుంచి పాతాళానికి పడేశాయి. ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా విజయ్ దేవరకొండ మార్కెట్ పూర్తిగా జీరో అయిపోవడం ఖాయం. మరి ఈ సినిమా విజయ్ కెరీర్ ను ఎంతవరకు మలుపు తిప్పుతుందో చూడాలి.