Moviesసందీప్‌రెడ్డి వంగ ' భ‌ద్ర‌కాళి ' లో చిరంజీవి ఉగ్ర‌రూపం చూశారా..?

సందీప్‌రెడ్డి వంగ ‘ భ‌ద్ర‌కాళి ‘ లో చిరంజీవి ఉగ్ర‌రూపం చూశారా..?

తెలుగు సినీ పరిశ్రమకు సిసలైన మార్గదర్శకుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. ఆయ‌న వ‌చ్చాక ఎన్ని జెన‌రేష‌న్లు వ‌స్తున్నా చిరు 70 ఏళ్ల వ‌య‌స్సుకు చేరువ అవుతోన్న వేళ కూడా త‌న దూకుడు చూపిస్తూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నా సీనియర్, యంగ్, ఫ్రెష్ ఆర్టిస్ట్ చాలా మంది తమ ఇన్స్పిరేషన్ చిరు అనే చెబుతుంటారు. ఇక చాలా మంది ద‌ర్శ‌కులు కూడా త‌మ‌కు స్ఫూర్తి చిరు అంటారు.ఇక టాలీవుడ్‌లో బోల్డ్ ద‌ర్శ‌కుల‌లో సందీప్ రెడ్డి వంగా ఒక‌రు. తాజాగా ఆయన హైదరాబాద్ లో తన నిర్మాణ సంస్థ భద్రకాళి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన తన ఆఫీస్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలే గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ ఫొటోల్లో ప్రపంచ సినిమా మార్గదర్శకుడు ‘మార్టిన్ స్కోర్సెస్’ టాక్సీ డ్రైవర్, ‘డేవిడ్ ఫించర్స్’ ఫైట్ క్లబ్, ‘స్టాన్లీ కుబ్రిక్’ క్లాక్‌వర్క్ ఆరెంజ్, ‘పాల్ థామస్ ఆండర్సన్’ దేర్ విల్ బి బ్లడ్ ఫోటో ఫ్రేమ్స్ ఆకర్షించాయి. ఎన్ని ఫొటోలు ఉన్నా కూడా అన్నింటికంటే బాగా ఆక‌ర్షించింది పులి రాజు ఫొటో.ఇంత‌కు ఆ పులి రాజు ఎవ‌రు ? అనుకుంటున్నారా ? 1987 ప్రముఖ దర్శకుడు భారతీ రాజా తెరకెక్కించిన క్లాసిక్ సినిమా ఆరాధ‌న‌. ఇందులో సుహాసిని హీరోయిన్‌.. చిరు హీరో. ఈ సినిమాలో ఇరు పాత్ర పేరు పులిరాజు. ఈ పాత్ర‌లో పొగరు, కోపం అణువణువు నిండిపోయి ఉంటాయి. ఇతని ప్రవర్తన క‌న్న‌త‌ల్లిని సైతం తుల‌నాడేలా ఉంటుంది. సినిమాలో జెన్నిఫర్ అనే టీచర్ పులి రాజు చెంప చెళ్లుమనిపిస్తుంది. ఈ క్రమంలోనే పులిరాజు ఇచ్చే యాంగ్రీ లుక్‌నే సందీప్‌రెడ్డి వంగ తన భద్రకాళి ఆఫీసులో హైలెట్ చేసి పెట్టుకున్నాడు.

Latest news