Moviesకేసులు.. కోర్టు గొడ‌వ‌ల త‌ర్వాత ఫ‌స్ట్ టైం అలా చేస్తోన్న బ‌న్నీ.....

కేసులు.. కోర్టు గొడ‌వ‌ల త‌ర్వాత ఫ‌స్ట్ టైం అలా చేస్తోన్న బ‌న్నీ.. !

ఏ ముహూర్తాన పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందో కానీ .. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు బాహుబలి 2 రికార్డులు చదలు పట్టించినా ఆ ఆనందం బన్నీకి ఎంత మాత్రం లేదు. కోర్టు కేసులు.. వివాదాలు బెయిల్ వీటితోనే సరిపోయింది బన్నీకి. ఈ వరుస ఇబ్బందులతో బన్నీ బయటికి రావటమే మానేశాడు. తన పుష్ప 2 సినిమా విజయాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయాడు అన్నది వాస్తవం. అలా కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్ ఎట్టకేలకు మరోసారి వేదికపై కనిపించబోతున్నాడు.Pushpa 2 OTT release: When and where to watch the Allu Arjun starrer onlineతన తండ్రి అల్లు అరవింద్ నిర్మించిన తండేల్ సినిమా ప్రచారం కోసం బయటకు వస్తున్నాడు. సంధ్య థియేటర్ సంఘ‌ట‌న తర్వాత పబ్లిక్ ఫంక్షన్ లో బన్నీ కనిపించడం ఇదే తొలిసారి అవుతుంది. తండేల్ రాజ్ కోసం పుష్ప‌రాజ్ ఎంట్రీ అంటూ ఇప్పటికే యూనిట్ ప్రచారం షురూ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వటం లేదు.. ఇచ్చినా కోర్టులు ఊరుకోవటం లేదు. బెనిఫిట్ షోలు పూర్తిగా రద్దు అయ్యాయి.Thandel Songs Download 2025 | Naga Chaitanya's Thandel Naa Songsదీనికి తోడు మైనర్లను సెకండ్ షోలకు అనుమతించవద్దంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు పుష్ప 2 థియేటర్ ర‌న్ దాదాపు ముగిసింది. ఇప్పుడు రీ లోడెడ్‌ వెర్షన్ పేరిట ఏకంగా మూడు గంటల 44 నిమిషాల సినిమాను ఇప్పుడు ఓటీపీలో స్ట్రీమింగ్ కు పెట్టారు. సినిమా చూసి అలసిపోయమంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. 13 ఎపిసోడ్లు వెబ్ సిరీస్ ఒకేసారి చూసిన ఫీలింగ్ కలిగిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Latest news