టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లరి నరేష్‌తో రెండు సినిమాలు తీసిన ఆ నిర్మాత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు. ఆ నిర్మాత ఎవరో కాదు..అల్లరి నరేష్‌తో ‘మడత కాజా‘ – ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్ (54) శుక్రవారం ఉదయం మృతిచెందారు. భవన నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న ఆయన సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే అల్లరి నరేష్‌తో మడత కాజా సినిమాతో పాటు సంఘర్షణ సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మాతగా మరో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఆయన అకాల మరణం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టివేసింది. గత కొంతకాలంగా వేదరాజు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.వేదరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్య క్రియలు శుక్రవారమే జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్మాత వేదరాజు టింబర్ మృతికి టాలీవుడ్ ఇండస్ట్రీ నివాళులు అర్పిస్తూ.. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.
Moviesబిగ్ బ్రేకింగ్: అల్లరి నరేష్ సినిమాల నిర్మాత మృతి
బిగ్ బ్రేకింగ్: అల్లరి నరేష్ సినిమాల నిర్మాత మృతి
- Tags
- allari naresh
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- Hero Allari Naresh
- intresting news
- intresting updates
- journalist excluisve
- Latest News
- latest trending news
- Madata kaja
- sangharshana
- social media
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- vedaRaju
- very useful news
- viral news