Movies2024లో ఒక్క సినిమా లేదు .. కానీ 2025లో పాన్ ఇండియాను...

2024లో ఒక్క సినిమా లేదు .. కానీ 2025లో పాన్ ఇండియాను షేక్ చేయడానికి సిద్ధమైన బ్యూటీ..!

చిత్ర పరిశ్రమలో ఉండే చాలామంది హీరోయిన్లు ఏడాదికి ఒకటి లేక రెండు సినిమాలు చేస్తున్నారు .. కానీ కొంతమంది భామలు మాత్రం చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు .. మొన్నటివరకు పూజా హెగ్డే , తమన్నా, సమంత లాంటి స్టార్ హీరోయిన్ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు .. కానీ ఆ తర్వాత సినిమాలు తగ్గించారు .. ఇక ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసుకుంటూ వస్తున్నారు .. ఇక ఆ తర్వాత వచ్చిన యంగ్ హీరోయిన్లు శ్రీలీలా , కృతి శెట్టి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేశారు .. యంగ్ హీరోలు అందరితో కలిసి నటించి మెప్పించారు .. ఇక ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి .. కానీ ప్లాప్‌లు పలకరించడంతో ఈ ముద్దుగుమ్మలు స్పీడ్ కు కూడా బ్రేకులు పడ్డాయి .. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం ఎక్కడా తగ్గేదిలే అంటుంది ..

Trisha Krishnan | తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో త్రిష..-Namasthe  Telangana

2025 లో బిజీ హీరోయిన్ ఎవరు అంటే ముందు చెప్పేది ఆమె పేరే .. యంగ్ హీరోయిన్‌ అయితే కాదు .. అయినప్పటికీ పాన్ ఇండియా వైడ్‌ గా వరుస సినిమాల్లో దూసుకుపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తెలుగు , తమిళ , మలయాళం భాషలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది .. ఇక ఇప్పుడు 2025 లోను వరుస సినిమాలకు ఒకే చెప్పి దూసుకుపోతుంది .. ఇక ఈ సంవత్సరం ఏకంగా ఆరు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ .. ఇక పైగా ఆరు సినిమాలు కూడా స్టార్ హీరోల సినిమాలు .. ఇంతకు ఆ బ్యూటీ మరెవరో కాదు చెన్నై బ్యూటీ త్రిష .. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్గా రానించింది .. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇక త్రిష 2024 లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు .. దళపతి విజయ్ నటించిన ది గోట్‌ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది ..మళ్ళీ త్రిష 'రికార్డులు' | Telugu Cinemaకానీ ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలను ఓకే చేసింది .. ముందుగా అజిత్ హీరోగా నటిస్తున్న విదాముయార్చి సినిమాలో నటిస్తుంది .. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇక ఈ సినిమాకు మిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు .. అలాగే అజిత్ నటిస్తున్న మరో సినిమా గుడ్ బాడ్ అగ్లీ సినిమాలోను త్రిషనే మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది .. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పుష్పా నిర్మాతల మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు .. అలాగే మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా వస్తున్న థగ్ లైఫ్ సినిమాలోని త్రిషా నటిస్తుంది .. అదేవిధంగా సూర్య 45 సినిమాలోను ఈ అమ్మడే హీరోయిన్ .. ఇలా వీటితోపాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభ‌ర సినిమాలో కూడా త్రిష హీరోయిన్గా చేస్తుంది.. వీటితోపాటు మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ హీరోగా వస్తున్న ఐడెంటిటీ అనే సినిమాలో కూడా త్రిష మలయాళం లో నటిస్తుంది. ఇలా 2025లో మాత్రం ఈ సీనియర్ బ్యూటీ పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపటానికి రెడీ అవుతుంది.

Latest news