Moviesసూప‌ర్ ట్విస్ట్ : బాల‌య్య కొత్త సినిమా టైటిల్ రేప‌టి తీర్పు......

సూప‌ర్ ట్విస్ట్ : బాల‌య్య కొత్త సినిమా టైటిల్ రేప‌టి తీర్పు… !

నందమూరి బాలకృష్ణ తాజాగా సంక్రాంతి డాకు మహారాజ్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందు బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి సినిమా చేసి హిట్ కొట్టారు. భగవంత్‌ కేసరి సినిమాను టాప్ హీరో విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్లో 69వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇది బాల‌య్య సినిమాకు రీమేకా కాదా అన్నదానిపై కొన్ని సందేహాలు ఉండేవి. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ న‌టుడు వీటి గ‌ణేష్‌ చేసిన కామెంట్స్ తో క్లారిటీ వచ్చేసింది. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలలో అడుగుపెట్టిన సందర్భంగా చివరగా నటిస్తున్న సినిమా ఇదే కావటం విశేషం.Bhagavanth Kesari: “అడవి బిడ్డ…. నేలకొండ భగవంత్ కేసరి వచ్చిండు”..  దుమ్మురేపిన భగవంత్...ఈ ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా టీజర్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ లోగా ఈ సినిమా టైటిల్ గురించి అనధికారిక సమాచారం బయటకు వచ్చేసింది. ఈ సినిమాకు నాలయ్యా తీర్పు అనే టైటిల్ ఖాయం చేసినట్టు తెలుస్తోంది. అంటే తెలుగులో రేపటి తీర్పు అని అర్థం. తెలుగులో భగవత్ కేసరి అనే మాస్ టైటిల్ పెడితే … తమిళంలో మాత్రం రేపటి తీర్పు అంటూ క్లాస్ టచ్ ఉన్న పేరు పెట్టడం విశేషం.అయితే ఈ టైటిల్ వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది విజయ్ హీరోగా నటించిన తొలి సినిమా పేరు రేపటి తీర్పు. 18 ఏళ్ల చిన్న వయసులో తన తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా అరంగ్రేటం చేయగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న విజయ్ ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నారు. హెచ్ వినోద్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. నమిత బైజు తెలుగులో శ్రీలీల‌ చేసిన పాత్రలో కనిపించనుంది.

Latest news