Moviesశోభ‌న్‌బాబు భోజ‌నంలో ప్ర‌తి రోజు అది ఉండాల్సిందే...!

శోభ‌న్‌బాబు భోజ‌నంలో ప్ర‌తి రోజు అది ఉండాల్సిందే…!

తెలుగు తెర ఎవర్‌గ్రీన్ సోగ్గాడు.. ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి చిత్ర పరిశ్రమంలో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమను శాసించారు. ఫ్యామిలీ కథ సినిమాలు పెద్దపెఠ‌ వేస్తూ ఇంటిల్ల పాదిని ఆకట్టుకున్నారు. మహిళ ప్రేక్షకుల్లో విశేష ఫాలోయింగ్ తెచ్చుకున్నారు శోభనబాబు. శోభనబాబు పేద.. మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చారు. అందరిలాగా తాను సినిమా కష్టాలు పడ్డారు. ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. సినిమాల నుంచి ఆయన తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు సినిమా సెట్ లోను అవమానాలు ఎదుర్కొని ఇబ్బందులు పడ్డారు. తర్వాత ప్రొడక్షన్ బాయ్స్ కూడా శోభన్ బాబుని ఎన్నో అవమానాలకు గురి చేశారట.Jayalalithaa & Sobhan Babu: Unforgettable Story!అలాగే ఫుడ్ విషయంలోనూ చులకనగా మాట్లాడే వారట.. సరైన ఫుడ్ కూడా పెట్టేవారు కాదట. ఈ క్రమంలో వడ పాయసంకి సంబంధించి ఓ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆయ‌న‌కు ఉంది. దాన్ని మనసులో పెట్టుకున్న శోభన్ బాబు తన భోజ‌నంలో ప్రతిరోజు ఆ ఐటెం ఉండేలా చూసుకున్నారట. కెరీర్ ప్రారంభంలో శోభన్ బాబు చిన్న చిన్న పాత్రలు వేసేవారు. ఈ క్రమంలో భోజనాలు పెడితే మెయిన్ ఆర్టిస్టులకు… వీరికి తేడా చూపించే వారట. వీళ్ల‌కు రైస్ – సాంబార్ ప్యాకెట్ – క‌ర్డ్ ప్యాకెట్ ఇచ్చే వారట. పెద్ద ఆర్టిస్టులకు వడ పాయసం వేసేవారట. తనకు వేయమంటే ఈ ఫుడ్ పెట్టడమే ఎక్కువ .. ఇంకా వడ పాయసం కావాలా అంటూ అవమానించారట ప్రొడక్షన్ బాయ్స్.

Shoban babu - Shoban babu telah menambah foto baru | Facebook

చాలా బాధపడిపోయిన సోగ్గాడు తాను పెద్దగా ఎదిగితే భోజనంలో ప్రతిరోజు వడ పాయసం ఉండేలా కచ్చితంగా చూసుకుంటాను అనుకున్నారట. అన‌తి కాలంలోనే ఆయన పెద్ద స్టార్ హీరో అయిపోయాడు.. అయితే ఆరోజు ప్రొడక్షన్ బై చేసిన అవమానం మాత్రం మర్చిపోలేదు.. తాను స్థాయికి వచ్చిన తర్వాత ప్రతిరోజు తన భోజనంలో వడ పాయసం ఉండేలా చూసుకునే వారట. ఈ విషయాన్ని రైటర్ నటుడు ఆయన తోటపల్లి మధు వెల్లడించారు. ఆయన సోగ్గాడి చాలా సినిమాలుకు రైటర్ గా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన తరచూ శోభన్ బాబు ఇంటికి వెళ్లేవారట. ఎప్పుడు వెళ్లిన భోజనంలో వడ పాయసం, స్వీట్ కనిపించే వ‌ట. ఓరోజు ఈ విషయం గురించి అడిగితే తనకు జరిగిన అవమానం బయటపెట్టారట శోభన్ బాబు.

Latest news