Moviesబాల‌య్య గొప్ప‌త‌నం ఎలాంటిదో చెప్పిన ప్ర‌గ్య జైశ్వాల్‌..!

బాల‌య్య గొప్ప‌త‌నం ఎలాంటిదో చెప్పిన ప్ర‌గ్య జైశ్వాల్‌..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి డాకు మహారాజ్‌ అంటూ ప్రేక్ష‌కులను పలకరించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాలో కావేరిగా తన పాత్రతో అందరిని ఆకట్టుకున్నారు హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్‌. గతంలో బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన అఖండ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో బాలకృష్ణతో మరో హిట్ కొట్టారు. ప్రగ్యా ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బాలకృష్ణతో వరుస సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టడంపై స్పందించారు. నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఆసక్తికర కామెంట్లు కూడా చేశారు.Akhanda (2021) - IMDbనా పుట్టినరోజు నాడే డాకు మహారాజు సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టింది. ఈ ఏడాది నాకు అద్భుతంగా ప్రారంభమైందని భావించాను.. ఈ సినిమాలో కావేరి పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని డాకు మహారాజ్ సినిమా విడుదలైన దగ్గరి నుంచి తనను అందరూ డాకు మహారాణి అని పిలుస్తున్నారని కావేరి పాత్ర అంత ప్రభావితం చూపిందని ప్రగ్యా చెప్పింది. ఒక న‌టిగా ఈ పాత్ర తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని.. గర్భిణీ పాత్రలో నటించడం కొత్త అనుభూతి ఇచ్చిందని తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసిన పోరాటం ప్రేక్షకుల మనసులను కదిలించింది.. మహిళలు ఎంత బలమైన వారు ఈ పాత్ర చూస్తే అర్థమవుతుందని ప్రగ్య తెలిపింది.Daaku Maharaaj Review - TeluguBulletin.comఇక బాలకృష్ణతో రెండు సినిమాలుకు వర్క్ చేయడం గురించి మాట్లాడుతూ బాలయ్య ఒక లెజెండ్ బాలకృష్ణ పేరు చెప్పగానే పాజిటివిటి గుర్తొస్తుంది.. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి. మనసులో మాట నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి.. అందరిని ఒకేలా గౌరవిస్తారు మంచిమనిషి అని తెలిపింది. ఇక సినిమాలో పాత్ర ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు. అంతేగాని వారి వయసు ఆధారంగా సినిమా అవకాశాలు ఇవ్వ‌రని.. అఖండ విడుదలైన తర్వాత బాలయ్యను.. తన‌ను స్క్రీన్ పై చూసి చాలా ఆశ్చర్యపోయినట్టు ప్రగ్య‌ తెలిపింది.

Latest news