Moviesవిశ్వంభ‌ర డైరెక్ట‌ర్‌గా నాగ్ అశ్విన్‌.. చిరు ప‌నికి అంతా అయోమ‌యం..?

విశ్వంభ‌ర డైరెక్ట‌ర్‌గా నాగ్ అశ్విన్‌.. చిరు ప‌నికి అంతా అయోమ‌యం..?

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ ప్రస్తుతం శ‌రవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తర్కెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ దర్శకుడు వినాయక ఇన్వాల్వ్ అయ్యారని రూమర్లు వచ్చాయి. ఇప్పుడు కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్‌ కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్ విశ్వంభ‌ర‌ సినిమా వి ఎఫ్ ఎక్స్ వర్క్ లీడ్ చేస్తున్నారట. మ‌ల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇషా చావ్లా – ఆషికా రంగ‌నాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్ సంస్థ రు.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తోంది.Breaking: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. 'విశ్వంభర' నుంచి ఫస్ట్ లుక్  పోస్టర్ విడుదల | Chiranjeevi Vishwambhara Movie first look poster Releaseచిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఎక్కుతున్న సినిమా ఇది. సైరా నరసింహారెడ్డి తర్వాత పాన్ ఇండియా సినిమాగా దీనిని రూపొందిస్తున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయిలో సోషియో ఫాంట‌సీ సినిమాగా చిరంజీవి నటిస్తున్న సినిమా ఇదే కావటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా లేటెస్ట్ వార్తలు మెగా అభిమానులలో తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి. విశ్వంభ‌ర‌ సినిమాకు వశిష్ట దర్శకుడు కాగా.. వివి వినాయక్ నాగ్ అశ్విన్ ఇన్వాల్ అవుతున్నారన్న వార్తలతో వారిలో కలవరం కలుగుతోంది.Vishwambhara : 'విశ్వంభర'లో చిరంజీవి డ్యూయల్ రోల్.. ఆసక్తి కలిగిస్తున్న  నిర్మాతల పోస్టు.. | Chiranjeevi is doing dual role in vishwambhara  movie-10TV Teluguఔట్పుట్ బెటర్మెంట్ కోసం చిరంజీవి సలహా మేరకు వినాయక్‌ రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే మహానటి – కల్కి సినిమాలతో ఆడియన్స్ మాయ చేసిన నాగ్ అశ్విన్‌ కూడా ఇప్పుడు ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ లీడ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సిజీ వర్క్ క్వాలిటీ విషయంలో చిరు అస్స‌లు తగ్గటం లేదు. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ నాసిరకమైన సీజీతో ఉందని దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అందుకే చిరంజీవి చాలా కేర్ తీసుకుని ఇప్పుడు నాగ్‌ అశ్విన్ రంగంలో దిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సమ్మర్ టార్గెట్ గా మే 9న రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లేని పక్షంలో సినిమా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

Latest news