ప్రజెంట్ దిల్ రాజు ఎంత కోపంగా ఉన్నాడో అందరికీ బాగా తెలిసిన విషయమే. ఆయన ఎంతో కష్టపడి ఇన్నాళ్లు సంపాదించుకున్నదంతా కూడా పెట్టి మొత్తంగా కూడా గేమ్ చేంజర్ సినిమాపై పెట్టేశారు . ఒక్కొక్క పాటకి 75 కోట్లు ఖర్చు చేశారు అంటే ఈ సినిమా కథను దిల్ రాజు ఎంత బాగా నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. అయితే గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న రాంచరణ్ తో ఎన్ని కోట్లు పెట్టిన అయిన సరే సినిమా నిర్మించొచ్చు అంటూ దిల్ రాజు చాలా డేర్ స్టెప్ వేస్తూ గేమ్ చేంజర్ సినిమా కోసం ఉన్న ఆస్తి మొత్తం ధారపోసేసాడు.అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అఫ్కోర్స్ ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి పాజిటివ్ నెగిటివ్ టాక్ కామన్.. కానీ గేమ్ చేంజర్ విషయంలో కూసింత ఎక్కువగానే నెగిటివ్గా స్పందిస్తూ వచ్చారు కొంతమంది జనాలు . అయితే దీని వెనక ఒకసారి బ్యాచ్ కావాలని టార్గెట్ చేసింది అంటూ దిల్ రాజు మండిపడ్డారు . అంతేకాదు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన 24 గంటల్లోపు హెచ్డి ప్రింట్ బయటకు రావడం ..దర్జాగా ప్రైవేట్ బస్సులో టెలికాస్ట్ చేయడం సంచలనంగా మారింది . హెచ్డి ప్రింట్ సోషల్ మీడియాలో విడుదల చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు కొంతమంది సో కాల్డ్ పెద్దమనిషికి సంబంధించిన వ్యక్తులు అన్న విషయం బయటపడింది . ఇలాంటి విషం కక్కిన వారిపై నిర్మాత దిల్ రాజు మండి పడ్డారు. అంతేకాదు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు .
“చరణ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు అని .. అయితే ఆయన కష్టాన్ని మొత్తం నాశనం చేసేస్తున్నారు అని .. ఈ సినిమా విడుదల రోజే ఒక 45 మందితో కూడిన ముఠా హెచ్డి ప్రింట్ పరిస్థితి ఆన్లైన్ లో విడుదల చేస్తామంటూ ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చింది అని.. సోషల్ మీడియాలో కొన్ని సీన్స్ లు కూడా పోస్ట్ చేస్తూ ఆనందం పొందారు అని ..దీని వెనకాల ఎవరు ఉన్నారో ఆ విషయం నాకు బాగా తెలుసు అని.. పోలీసులకు ఆ సమాచారాన్ని అందిస్తున్నామని ..ఊచలు లెక్కపట్టడానికి సిద్ధంగా ఉండండి ” అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాదు దిల్ రాజు అంత స్ట్రైట్ గా ఈ ఘనకార్యం చేసిన ప్రబుద్ధులు ఎవరో నాకు తెలుసు అని చెప్పడం అదే విధంగా వాళ్ళ పేర్లను కూడా పోలీసులకు ఇచ్చాము త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారని చెప్పడం సంచలనంగా మారింది . అయితే సోషల్ మీడియాలో జనాలు టూ ఆక్టివ్ గా మారిపోయారు. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా లీక్ చేసింది.. సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒక బడా ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన బినామీనే అంటూ వార్తలు బయటకు వచ్చాయి . ఆ సో కాళ్లు పెద్దమనిషికి దిల్ రాజుకి అస్సలు ఈ మధ్య పోసకడం లేదు అని .. ఆ కారణంగానే దిల్ రాజు సినిమాను ఇలా ఫ్లాప్ చేయడానికి కంకణం కట్టుకున్నాడు అంటూ మాట్లాడుతున్నారు. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్తున్నా ..ఎక్కడా కూడా దానికి తగ్గట్టు సిచువేషన్స్ కనిపించడం లేదు. గేమ్ చేంజర్ థియేటర్స్ ఏది చూసినా ఖాళీగానే ఉన్నాయి..!