Moviesబాక్స్ ఆఫిస్ వద్ద 'డాకు మహారాజ్' ఊచకోత..మూడో రోజు మైండ్ బ్లాకింగ్...

బాక్స్ ఆఫిస్ వద్ద ‘డాకు మహారాజ్’ ఊచకోత..మూడో రోజు మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్..!

‘డాకు మహారాజ్’.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో ఎంత మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. నందమూరి హీరోగా బాగా పాపులారిటి సంపాదించుకున్న నట సింహం బాలయ్య నటించిన తాజా సినిమానే ఈ ‘డాకు మహారాజ్’. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘డాకు మహారాజ్’.. సినిమాలో బాలయ్య హీరోగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మొదటిరోజు బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్స్ నెలకొల్పింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సినిమా ఫస్ట్ డే సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది .Balakrishna : డాకూ మహరాజ్ గా బాలయ్య | Balayya as Daku Maharajఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద 27 కోట్ల కోల్ల కొట్టగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 56 కోట్లు వసూలు చేసింది . ‘సంక్రాంతి’ రేసులో నిలిచిన ఈ మూవీ రికార్డ్స్ స్థాయిలో వసూలు కలెక్షన్స్ అందుకోవడం నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ క్రియేట్ చేసింది . ఇక రెండో రోజు 13.5 కోట్లు వసూలు చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు . కాగా మూడవరోజు కూడా బాలయ్య హవా ఏ మాత్రం తగ్గకుండా ముందుకు దూసుకెళ్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ‘డాకు మహారాజ్’ థర్డ్ డే కలెక్షన్స్ 12.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది.Daku Maharaj Child Artist Veda Agarwal: డాకు మహారాజ్‌లో వైష్ణవి పాత్రలో  మెప్పించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా.. పర్ఫామెన్స్‌తో అదరగొట్టిందిగా!ఇక ఈ మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజు మొత్తంగా 50.27 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. అదే వరల్డ్ వైడ్ గా 86 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది . ఈ లెక్కలు చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే తెలుస్తుంది. గాడ్ ఆఫ్ మాసెస్ గా పిలుచుకునే బాలయ్య దూకుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం తగ్గడం లేదు . ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఉండడంతో సినిమా కలెక్షన్స్ మరింత స్థాయిలో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ సంక్రాంతికి రియల్ విన్నర్ బాలయ్యే అంటూ జై బాలయ్య అని తెగ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్..!

Latest news