Moviesబాల‌య్య రాక్స్‌.. బాక్సాఫీస్ షేక్‌.. ` డాకు ` 12 డేస్...

బాల‌య్య రాక్స్‌.. బాక్సాఫీస్ షేక్‌.. ` డాకు ` 12 డేస్ క‌లెక్ష‌న్స్ ఇవే!

గాడ్ ఆఫ్ మాసెస్ నంద‌మూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్ ` డాకు మహారాజ్‌ `. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటిక్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ స్టోరీనే అయినా దాన్ని కొత్త ప్ర‌జెంట్ చేయ‌డంలో బాబీ స‌క్సెస్ అయ్యాడు. నంద‌మూరి ఫ్యాన్స్ తో పాటు మిగ‌తా ఆడియెన్స్ ను కూడా డాకు ఆక‌ట్టుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టం, సంక్రాంతి సీజ‌న్ కావ‌డంతో బాల‌య్య బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.పోటీగా సంక్రాంతికి వ‌స్తున్నాం, గేమ్ ఛేంజ‌ర్ వంటి చిత్రాలు ఉన్న‌ప్ప‌టికీ.. తొలి వారం డాకు అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టింది. సెకెండ్ వీక్ నుంచి కొంచెం స్లో అయిన కూడా స్ట‌డీగా వెళ్తోంది. తాజాగా 12 డేస్ ర‌న్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ కు అతి చేరువ‌లో ఉంది. ఏపీ మ‌రియు తెలంగాణ‌లో 12 రోజుల‌కు గానూ రూ. 66.41 కోట్ల షేర్‌, రూ. 103.55 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టింది.తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో రూ. 14.62 కోట్లు, సీడెడ్ లో రూ. 12.16 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌లో రూ. 10.57 కోట్లు, తూర్పులో రూ. 7.06 కోట్లు, పశ్చిమలో రూ. 5.18 కోట్లు, గుంటూరులో రూ. 8.02 కోట్లు, కృష్ణలో రూ. 5.38 కోట్లు, నెల్లూరులో రూ. 3.42 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అలాగే 12 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా డాకు మ‌హారాజ్ చిత్రం రూ. 78.51 కోట్ల షేర్‌, రూ. 129.45 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను వసూల్ చేసింది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్ల రేంజ్ లో ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌క 96 శాతం రిక‌వ‌రీ అయిపోయింది. ఇంకా రూ. 3.49 కోట్ల షేర్ వ‌స్తే.. బాక్సాఫీస్ వ‌ద్ద డాకు క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక టాక్ బాగుంది కాబ‌ట్టి.. మిగ‌తా ర‌న్ లో ఈ టార్గెట్ ను రీచ్ కావ‌డం పెద్ద క‌ష్టమేమి కాద‌నే చెప్పొచ్చు. మొత్తానికి అఖండ‌, వీర సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి చిత్రాల త‌ర్వాత‌ డాకు రూపంలో బాల‌య్య మ‌రో హిట్ కొట్ట‌డంతో ఆయ‌న స‌క్సెస్ గ్రాఫ్ మ‌రింత భారీగా పెరిగిపోయింది.

Latest news