టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇటీవల కాలంలో సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చేసింది. ఐదేళ్ల తర్వాత ఆమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో అనుష్క తొలి సినిమా సూపర్ హీరో నాగార్జున. నాగార్జున – అనుష్క జోడి కి తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అనుష్క – నాగార్జున కాంబినేషన్ అంటే చాలు తెలుగు ప్రేక్షకులు ధియేటర్లకు పరుగులు పెట్టి మరి సినిమాలు చేసేవారు. అయితే చివరలో నాగార్జునకు – అనుష్క మధ్య ఏదో తేడా వచ్చిందని .. అందుకే అనుష్క దూరం పెట్టాడన్న ప్రచారం కూడా ఇండస్ట్రీలో ఉంది.ఇక నాగార్జున – అనుష్క మధ్య సంథింగ్ సంథింగ్ నడిచిందన్న ప్రచారం కూడా ఉంది. వైజాగ్ తో పాటు అమరావతి – హైదరాబాద్ – బెంగళూరు – చెన్నై రియల్ ఎస్టేట్లో వీరిద్దరు కలిసి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారని కూడా అంటారు. విచిత్రం ఏంటంటే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యకు.. అనుష్క మధ్య పెళ్లి జరగబోతుందని వార్త అప్పట్లో తెలుగు మీడియాలో షేక్ చేసింది. ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి లో అనుష్కతో నాగచైతన్య పెళ్లి జరగబోతుందని దీనికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఒక వార్త వచ్చింది.
ఈ వార్త ఒక్కసారిగా తెలుగు మీడియాను షేక్ చేసి పడేసింది. ఆ తర్వాత నాగార్జున అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇవ్వడంతో ఆంధ్రజ్యోతి తన వార్తకు ఖండన కూడా ఇచ్చుకుంది. ఆ తర్వాత నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్ సమంత ప్రేమలో పడి పెళ్లి చేసుకుని నాలుగేళ్ల కాపురం తర్వాత విడాకులు ఇవ్వడం …ఇప్పుడు మరో హీరోయిన్ శోభితను ప్రేమ వివాహం చేసుకోవడం తెలిసిందే.