అతగాడు టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో.. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. కాసనోవా అనే పేరు ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల్లో సంపాదించుకున్నాడు. తనతో పాటు పనిచేసిన ఓ హీరోయిన్ తో కొన్నాళ్లపాటు సహజీవనం కానీ సహజీవనం లాంటిది చేశాడు. ఆ కథ అక్కడితో ఆగిపోయింది. ఆ హీరోయిన్‌తో దుకాణం సర్దేశాడు. తర్వాత మరో హీరోయిన్ తో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగినట్టు గాసిప్ వినిపించాయి .. ఆ స్టోరీ కూడా ముగిసింది.
ఇప్పుడు లేటెస్ట్ గా మరో హీరోయిన్‌తో డ్యూటీతో పాటు జర్నీ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మాయి అతగాడితో సినిమా చేస్తోంది. ఆ అమ్మాయికి ఫస్ట్ మంచి హిట్ పడింది. ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఛాన్సులు రాలేదు కాని.. మంచి పేరు అయితే వచ్చింది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఈ హీరో తో చాలా అంటే చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఎంత క్లోజ్ అంటే ఆ హీరో.. ఆ హీరోయిన్ కలిసి నటిస్తోన్న సినిమా షూటింగ్ కొన్నాళ్ల క్రితం వేరే దేశంలో జరిగింది. హీరోయిన్ సీన్లు లేకపోయినా కూడా ఈ అమ్మాయి అక్కడే ఉండి షూటింగ్ మొత్తం అయిపోయాక వెనకకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇలా ఉండిపోవటం జస్ట్ హీరోతో ఫ్రెండ్షిప్ కోసమే అని చెప్పుకుంటున్న తెరవెనక వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని అంటున్నారు.