సరిగ్గా ఇంకో ఐదు రోజుల్లో పుష్ప 2 సునామీ మొదలు కాబోతుంది .. దీపావళి తర్వాత సరైన సినిమాలు లేక అల్లాడిపోతున్న థియేటర్లు హౌస్ ఫుల్ తో కిక్కిరిసిపోయే టైం దగ్గర పడుతుంది .. ఖాళీగా ఉన్న పార్కింగ్ స్టాండ్‌లు, , క్యాంటీన్లలో సిబ్బంది క్షణం తీరికలేని పనులతో బిజీ కాబోతున్నారు . ముందస్తు సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించబోతున్నారు .. అయితే టికెట్ రేట్లకు సంబంధించిన అనుమతుల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు .. ఏ నిమిషమైనా అవి వచ్చే అవకాశం ఉంది .. రావడం ఆలస్యం బుక్ మై షో పేటీఎం తదితర యాప్స్ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోతాయి.అయితే ఇప్పుడు అందరు చూపు టిక్కెట్ రేట్లు పెంపు ఏ మోతాదులో ఉంటుందని ఎదురు చూస్తున్నారు .. ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమ విన్నపాలు పట్ల ఎంతో సానుకూలంగా ఉంది కాబట్టి .. టికెట్ రేట్లు పెంపు గురించి మైత్రి మేకర్స్ లో టెన్షన్ కనిపించడం లేదు . ఇక ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం తమ బ్యానర్ హీరో కావడంతో పాటు చిత్ర పరిశ్రమ తరపున ఎవరు ఏది అడిగినా దానికి నో చెప్పని మనిషి కాబట్టి గరిష్టంగా దేవర కంటే ఒక్కో టికెట్ మీద 150 నుంచి 200 మధ్యలో పెంపు ఉంటుందని భావిస్తున్నారు. దీన్నిబట్టి మల్టీప్లెక్స్ రేట్ 400 రూపాయలు ఉండొచ్చు.. తెలంగాణలో దేవరకి ఇచ్చిన అంతే పెంచుతారని టాక్ ఉంది కాబట్టి ఎంత ఉంటుందనేది చూడాలి.ఇక రెండు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకే రేటు ఉండే అవకాశం ఉందని కూడా కొందరు అంచనా వేస్తున్నారు .. రెగ్యులర్ షోలు సంగతి ఎలా ఉన్నా కూడా ప్రీమియర్ల డిమాండ్ మాత్రం గట్టిగా కనిపిస్తుంది .. అర్ధరాత్రి ఒంటిగంట తెల్లవారు జామున షోలకు విపరీతమైన క్రేజ్ కనిపిస్తుంది. బిసి సెంటర్ల సింగల్ స్క్రీన్ల అధికారిక ధరే 750 దాకా పలుకుతోందట . ముందు రోజుకు ఇది ఎన్ని వేల రూపాయలకు చేరుతుందో ఊహించడం కష్టం. రెండు వారాలుగా థియేటర్లకు వెళ్లకుండా ఆదాచేసిన డబ్బంతా సినీ ప్రియులు పుష్ప 2 కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. సో టికెట్ దొరకాలే కానీ డోంట్ కేర్ అన్న తరహాలో బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు .