Moviesషాక్‌... రెండో రోజుకే తెలుగులో ' పుష్ప 2 ' భారీ...

షాక్‌… రెండో రోజుకే తెలుగులో ‘ పుష్ప 2 ‘ భారీ డ్రాప్ .. ?

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపేస్తుంది. అధికారికంగా లెక్కలు రాకపోయినా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రు. 175 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అటు అమెరికాలోనూ 4.5 బిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారు 35 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్టు తెలుస్తోంది. హిందీలో అయితే ఏకంగా రు. 67 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు వర్షం కురిపించిన పుష్ప రెండోరోజు కొంతమేరకు కలెక్షన్లలో తగ్గుదల కనిపిస్తోంది. అయితే నార్త్ లో మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ బుకింగ్స్ లో మార్పు కనబడుతోంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర తన ర్యాంప్‌ చూపించడంలో ఆశ్చర్యం లేదు .. కానీ రెండో రోజు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ డ్రాప్ అవ్వ‌డం ఆశ్చర్యంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్‌లో రెండవ రోజు 60% అడ్వాన్స్ బుకింగ్లు కనపడుతున్నాయి .. అంటే రెండో రోజు కచ్చితంగా రు. 50 కోట్లు నికర ఆదాయం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.

అదే సౌత్ కు వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు అడ్వాన్సులలో కేవలం మూడోవంతు మాత్రమే ఉన్నాయి. అందుకు కారణం టికెట్ రేటు .. మెగా అభిమానులు ప్రకటిత బ్యాన్ కారణం అని అంటున్నారు. ఈ రెండు కాకుంటే రేపు శని.. ఆదివారాలు వీకెండ్ కావడంతో అప్పటికి చాలామంది ప్లాన్ చేసుకోవడం కూడా ఈరోజు కలెక్షన్ తగ్గడానికి కారణం అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news