సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఏం పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇటీవల సమంత తండ్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక గురువారం ఆమె పెట్టిన రెండు పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫైట్ లైక్ ఎ గర్ల్ అంటూ ఓ వీడియో ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయగా ఇప్పుడు అది హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవలే ఆమె మాజీ భర్త నాగచైతన్య, మరో హీరోయిన్ శోభిత పెళ్లి జరిగింది.
ఆమె షేర్ చేసిన వీడియోలో ఓ అమ్మాయి, అబ్బాయి కుస్తీ పడుతుంటారు. అయితే అబ్బాయిలో ఓడించేస్తాను అనే నమ్మకం ఉంటుంది. అమ్మాయి కాస్త భయంగానే ఉంటుంది.. చివరకు అమ్మాయే గెలుస్తుంది… ఓడిపోయిన అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఈ వీడియోను షేర్ చేసి.. దానికి సమంత Fight like a Girl అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.
దీంతో ఆమె పోస్టుకు కొందరు నెటిజన్లు నీ పోస్టుతో ఎవరికి అయినా ఇన్‌డైరెక్ట్ కౌంటర్లు ఇస్తున్నారా ? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆమె మరో పోస్ట్ కూడా పెట్టారు. ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌కు చక్కని స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. సిటాడెల్ హనీ బన్నీలో పని చేయడం చాలా గౌరవంగా ఉంది అని రాసుకొచ్చింది. తాజాగా ఆమె చేసే ప్రతి పోస్ట్ నాగచైతన్య, శోభితల పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్స్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.