హైదరాబాదులోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయటం .. ఆ వెంటనే హైకోర్టు బెల్ మంజూరు చేయడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రొసీజర్ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ ఒక రాత్రి అంతా జైలులో నే ఉండాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తున్న విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చాక అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దర్శక నిర్మాతలు హీరోలు కలిసి పరామర్శించారు. షూటింగ్ ఇతర పనుల్లో బిజీగా ఉన్న పలువురు నటీ నటులు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత అల్లు అర్జున్ గురించి ఇన్స్టాల్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టారు. బెయిల్ పై ఇంటికి వచ్చిన బన్నీ ని చూసి ఆయన సతీమణి స్నేహ రెడ్డి కన్నీటి పర్యంతం ఆయన విషయం తెలిసిందే.ఈ వీడియోని షేర్ చేసిన సమంత తాను ఎమోషనల్ అయ్యానని పరోక్షంగా తెలియజేస్తూ ఇప్పుడు నేను ఏమి అడగటం లేదు ఓకే అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఎమోజీలు షేర్ చేశారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లను ట్యాగ్ చేసి వాళ్ళిద్దరిని చూస్తుంటే సంతోషంగా ఉందని అర్థం వచ్చేలా ఎమోజీలు పంచుకున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ రీ యూనియన్ వీడియో షేర్ చేస్తూ ఇది చూడటం కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావటం నిజంగా దురదృష్టకరం ఆయన వ్యవహరించిన తీరు చాలా అందంగా ఉంది అని సమంత పేర్కొన్నారు. అలాగే కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ కుష్బూ తో పాటు నయనతార భర్త దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా అల్లు అర్జున్ కు సపోర్టుగా పోస్టులు పెట్టారు.