టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ విజయ్ దేవరకొండ. మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్ రష్మిక మందన్న. వీరిద్దరు గత కొంత కాలంగా చాలా క్లోజ్‌గా ఉంటున్నారు.. వీరిది స్నేహాన్ని మించిన ప్రేమ అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ జంటను చూసిన టాలీవుడ్ జనాలు కూడా ఖచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కే జంటే అన్న భావనకు వచ్చేశారు. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్‌లో బిజీ బిజీగా ఉన్నారు.రష్మిక నటించిన పుష్ప 2 థియేటర్లలోకి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రష్మిక క్రేజ్ యానిమల్ సినిమా తర్వాత పుష్ప 2 దెబ్బకు రష్మిక క్రేజ్ జాతీయస్థాయిలో తాండవం చేస్తోంది. ఇక త్వరలోనే విజయ్ – రష్మిక పెళ్లి కూడా చేసుకోబోతున్నారని… ఈ నెలలోనే చిన్నగా ఎంగేజ్‌మెంట్ కూడా ఉందంటున్నారు. ఈ మేరకు విజయ్ ఫ్యామిలీ షాపింగ్ కూడా చేస్తోందన్న గాసిప్‌లు కూడా బయటకు వచ్చాయి.
దీనిపై కొందరు మీడియా వాళ్లు విజయ్ ఫాదర్ గోవర్థన్‌ను ప్రశ్నిస్తే విజయ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారని.. గౌతమ్ తిన్ననూరి సినిమా చేస్తున్నాడు… ఆ తర్వాత సంక్రాంతి నుంచి మైత్రీ వాళ్ల సినిమా ఉంటుంది.. ఆ తర్వాత దిల్ రాజు సినిమా పట్టాలెక్కుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే విజయ్ వీలు చూసుకుని కాస్త గ్యాప్ తీసుకుంటేనే పెళ్లి ఆలోచన చేయవచ్చన్నారు.
ఇటు రష్మిక కూడా కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. మరి వీరిద్దరికి ఎప్పటకి తీరిక ఉంటుందో..? అయితే పుష్ప 2 సినిమాను రష్మిక.. విజయ్ ఫ్యామిలీతో కలిసి చూసింది. దీనిని బట్టి చూస్తే రష్మికను విజయ్ ఫ్యామిలీ తమ కోడలిగా దాదాపు అంగీకరించినట్టేనా ? అన్న టాక్ కూడా ఉంది.