కల్కి – సలార్ – దేవర – పుష్ప 2 లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ పెద్ద సినిమాలకు నిర్మాతలు లేదా పంపిణీదారుడి మీద టిక్కెట్ల కోసం ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయో తెలిసిందే. వేల టిక్కెట్లు వీళ్లు ఫ్రీగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ముందుగానే తమకు కావాల్సిన థియేటర్ల నుంచి వేల కొద్ది టిక్కెట్లు ఫ్రింట్ చేయించుకుని తమ ఆఫీస్‌లకు తెప్పించుకుంటారు. అయితే పుష్ప 2 ఈ విషయంలో రికార్డులు బద్దలు కొట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో ఐదు స్క్రీన్‌లు ఉంటే మూడు స్క్రీన్లు మైత్రీ వాళ్లకే చేరాయంటున్నారు. మైత్రీ వాళ్ల చేతుల్లో చాలా సినిమాలు ఇంకా చెప్పాలంటే 12 వరకు లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలకు పనిచేసే నటీనటులు.. వాల్ల ఫ్రెండ్స్.. టెక్నీషియన్లు.. ఇతర సిబ్బంది అందరూ కలిస్తేనే వందలు.. వేలల్లో ఉంటారు. వీళ్లకు టిక్కెట్లు కావాలి.. వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు.. పోలీసులు.. ఆదాయపు పన్ను ఉద్యోగులు.. పొలిటికల్.. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇలా వీళ్లందరికి కలుపుకుంటే చాలా టిక్కెట్లు కావాలి.
ఈ సారి బన్నీ ఆఫీస్ నుంచి కూడా టిక్కెట్ల కోసం ఒత్తిడి వచ్చిందట. కేవలం ఒక్క మల్టీఫ్లెక్స్ నుంచే ఏకంగా రు. 11 లక్షల విలువైన టిక్కెట్లు వాళ్లకు వెళ్లాయట. వాళ్లు నేరుగా ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు.. కాకపోతే నిర్మాత లేదా బయ్యర్ల నుంచి వస్తే వాటికి మన చేతి డబ్బులు కట్టక్కర్లేదు కదా.. అది అసలు విషయం.. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో పెద్ద చర్చలే నడుస్తున్నాయి.