టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా .. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షో ల నుంచే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఫ్రీ సేల్ బుకింగ్స్ లోనే హవా చూపించిన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లలో సత్తా చాటినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 4 సెకండ్ షో రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన పుష్ప 2 కలెక్షన్ పరంగా ఓవర్సీస్ లో టాప్ లో కొనసాగుతుంది.
ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రు. 175 కోట్ల వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అమెరికాలో ఈ సినిమా తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ డాలర్లు .. అంటే రు. 35 కోట్ల పైన వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది.
అమెరికాలో ఈ స్థాయిలో వసూలు సాధించిన మూడో భారతీయ సినిమాగా పుష్ప 2 చరిత్రలో నిలిచిపోయింది. బుకింగ్స్ లో బుక్ మై షో లో పుష్ప 2 దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా మరోసారి హవా చూపింది. బుక్ మై షో లో ఒక్క గంటలోనే లక్ష టికెట్లు అమ్ముడు అయ్యాయి. గతంలో ఈ రికార్డు ప్రభాస్ కల్కి సినిమా పేరు మీద ఉండేది. కల్కి సినిమా గంటలో బుక్ మై షో లో 97,700 టికెట్లతో టాప్‌లో ఉంది. ఇప్పుడు దీనిని పుష్ప 2 తొలి రోజే బ్రేక్ చేసి పడేసింది.